ఢిల్లీలో కంత్రీగాళ్ల ఆడగాలు

delhi worstఢిల్లీలో మహిళలకు భద్రత లేదు.. లైంగిక వేధింపులు ఎక్కువ.. ఈవ్ టీజింగ్ కు పరాకాష్ట ఈ ఘటన. ఓ సూపర్ మార్కెట్ స్టోర్ లో.. షాపింగ్ చేస్తున్న మహిళను సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించిన తీరు కలకలం రేపుతోంది. ఓ మహిళ వస్తువులను పరిశీలిస్తూ ఉండగా.. పక్కనే కింద కూర్చుని ఉన్న ఓ యువకుడు కింద నుంచి షూట్ చేయటం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాళ్ల కింద నుంచి ఫొటోలు తీశాడు.  విషయాన్ని గమనించిన స్టోర్ సెక్యూరిటీ గార్డ్  ఇమేజ్ లను వెంటనే తొలగించాలనడంతో…డిలీట్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.   ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు చేయలేదు ఆ సెక్యూరిటీ గార్డ్. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఫొటోలు తీసిన వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటీవలే షూలోని కెమెరాతో స్కర్ట్స్ వేసుకున్న యువతలను ఫొటోలు తీసిన ఘటన బయటపడింది. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు బయటపడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy