ఢిల్లీలో టీ.కాంగ్ నేతల లాబీయింగ్…

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు, గెలిచిన నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ పెద్దలను కలుస్తూ తమ మనసులోని కోరికల చిట్టా బయట పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ నడుపుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలిశారు.

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గద్వాల నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో సీఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఆమె దిగ్విజయ్ ను కోరినట్లు సమాచారం. ఇక ఈ రోజు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశమైయ్యారు. ఆమెతో పాటు మహబూబ్ నగర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. సీఎల్పీ పదవి కోసం ఆమె తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో శాసనమండలిలో తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జైరాం రమేష్ ను కోరారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సోనియాకు నివేదిక అందించారు.

మొత్తానికి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy