ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?

article-0-1A3A92E100000578-871_468x308
ఢిల్లీ రాజకీయ పరిణాయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ రోజు ఉదయాన్నే ప్రస్తుత ఢిల్లీ పరిస్థితులు,తాజా పరిణామాలపై రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. అలాగే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపై రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పాలన కావాలని రాష్ట్రపతికి సిఫార్సు చేశాడు.

ఈ రోజు ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి పంపిన లేఖలో కేజ్రీవాల్ రాజీనామాతో పాటు తన నివేదికను పంపించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో దాదాపుగా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లొ అటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. ఇప్పటికే రెండు పార్టీలను లెఫ్టినెంట్ గవర్నర్ సంప్రదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు గురించి, రాష్ట్రపతి పాలను గురించి ఆయనకే సిఫార్సు చేశారు.
దాదాపుగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల సమాచారం.ఇప్పటి వరకూ కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. మొత్తానికి రాష్ట్రపతి చేతిలోనే ఢిల్లీ రాష్ట్రపతి పాలన ఉంది. కొంత సమయం తర్వాత దీనిపై సంగ్థిద్ధం వీడే అవకాశం ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy