ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం 2 లక్షల పైనే

kejriwal_8396b7b8-6c4f-11e5-9358-ce0f694bc37cఢిల్లీ ఎమ్మెల్యేల శాలరీలు భారీగా పెరగనున్నాయి. స్పీకర్ నియమించిన కమిటీ సిఫారసులు అమలైతే…  అలవెన్సులతో కలిపి 400 శాతం వేతనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టేబుల్ పై ఉంది. అయితే.. విపక్షాలు మాత్రం కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాయి.

ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలు నాలుగురెట్లు పెంచాలంటూ … కమిటీ చేసిన సిఫారసులు వివాదాస్పదమవుతున్నాయి. స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ సిఫారసులు అమలులోకి వస్తే శాసనసభ్యులకు లభించే అన్ని రకాల జీతభత్యాలు కలిసి రెండున్నర రెట్లు పెరుగుతాయి. ఢిల్లీ ఎమ్మెల్యేల ప్రస్తుతం శాలరీ, అలవెన్సులు కలిపి నెలకు రూ.88 వేలు పొందుతున్నారు. ఆ మొత్తాన్ని 2 లక్షల 10 వేలకు పెంచాలని ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. మూల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.50 వేలకు, నియోజకవర్గ అలవెన్సును రూ.18 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.

చివరి సారి 2011లో ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలను సవరించారు. అప్పటి వరకు ఉన్న శాలరీని 100 శాతం పెంచారు. ఆప్ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చాక శాలరీ పెంపు ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు రావడంతో… స్పీకర్ ఎక్స్ పర్ట్స్ కమిటీని నియమించారు. అయితే.. కమిటీ సిఫారసులతో ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు ఆప్ నేతలు.

ఎమ్మెల్యేల వేతనాల పెంపు సిఫారసులను విపక్షాలు తప్పుబడుతున్నాయి. సామాన్యుల పార్టీగా చెప్పుకునే వారు.. తమ ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచాలనడం దురదృష్టకరమన్నాయి. అసెంబ్లీలో వేతనాల పెంపు బిల్లును అడ్డుకుంటామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.  ఢిల్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలుండగా.. అందులో 67 మంది ఆప్ సభ్యులే. మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందినవారు. దీంతో.. శాలరీల పెంపుతో ప్రధానంగా లబ్దిపొందేది ఆప్ ఎమ్మెల్యేలే. ఇక సిఫారసులు చేసింది పేరుకు ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ అయినా.. అందులో చైర్మన్ పీడీటీ ఆచారి తప్పిస్తే మిగిలిన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలే. దీంతో.. కమిటీ రికమండేషన్స్ పై విమర్శలు గుప్పుమంటున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy