ఢిల్లీ ఎలక్షన్స్ కు ఎంఐఎం దూరం: అసదుద్దీన్

asad1ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మజ్లిస్ పార్టీ పోటీ చేయదని ఆ పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఢిల్లీలో తమ పార్టీ బలంగా లేదని, బూత్ లెవెల్ లో కేడర్ లేనందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీని ఢిల్లీలో బలోపేతం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగే ప్రతి ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్యులరిస్ట్ లు, అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళని ఢిల్లీలో గెలిపించాలని అసద్ ప్రజలను కోరారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy