ఢిల్లీ ఓడినా.. పంత్ గెలిచాడు

rishab-pantఐపీఎల్‌ – 10లో  బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. కేదార్‌ జాదవ్‌ (69) చెలరేగడంతో మొదట బెంగళూరు 8 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ఛేదనలో రిషబ్‌ పంత్‌ (57) అద్భుతంగా పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఆ జట్టు 9 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. పంత్‌ పోరాడుతున్నా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇతర బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేస్తూ పోయారు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సివుండగా.. పంత్‌ తొలి బంతికే ఔటవడంతో ఢిల్లీ అవకాశాలకు తెరపడింది.

అంకితభావం:

పంత్‌ తండ్రి బుధవారం రాత్రి మృతి చనిపోయారు. తండ్రి అంత్యక్రియలకు హాజరై.. అలాగే మ్యాచ్ కు వచ్చేశాడు. ప్రొఫెషనలిజమ్ తో … దృఢచిత్తంతో తన జట్టు గెలుపుకు కృషి చేశాడు. చివరి వరకు ఆడి.. గెలుపు కోసం శతదా ప్రయత్నించాడు. తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. కానీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy