ఢిల్లీ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. వీరూకే ఆ గౌరవం

firoz-shahటీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం రెండో గేట్ కు సెహ్వాగ్‌ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్‌ సంఘం నిర్ణయించింది. అక్టోబర్‌ 31 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత రోజే భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టీ20 జరగనుంది. ఢిల్లీ క్రికెట్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటి సారీ. సెహ్వాగ్ సాధించిన విజయాలకు సూచికగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఢిల్లీ క్రికెట్ సంఘం నాయకులు. త్వరలో మరికొందరు క్రీడా కారులను ఇదే తరహాలో సన్మానిస్తామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy