ఢిల్లీ గవర్నర్ ‘పవర్’ ఫుల్ నిర్ణయాలు..

Mar 6 Mindanao grid 640దేశ రాజధాని ఢిల్లీలో పవర్ కష్టాలు పెరిగాయి. వారం రోజుల క్రితం ఢిల్లీలో వచ్చిన భారీ వర్షాలతో అక్కడ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కల్గింది. ఇప్పటికే కరెంట్ కోతల గురించి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఢిల్లీ వాసులు కరెంట్ ను జాగ్రత్తగా వాడుకోవాలని కూడా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇక 5000 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్లలో కూడా ప్రస్తుతం వెయ్యి మెగా వాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు.

ఇక కరెంట్ కష్టాల నుంచి ప్రజలకు కాస్త ఉరటనిచ్చేందుకు గవర్నర్ నజీబ్ జంగ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల తర్వాత షాపింగ్ మాల్స్ కు కరెంట్ కట్ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. వాటితో పాటు ఢిల్లీ సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు, యూనివర్శిటీలు, కాలేజీల్లో మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 మధ్య ఏసీలను ఆపేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు గవర్నర్. అయితే అత్యవసర సదుపాయాలకు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy