తిరిగొచ్చిన మోడీ..

modi-returnsఐదు రోజుల అమెరికా టూర్ ముగించుకొని పీఎం నరేంద్ర మోడీ తిరిగి వచ్చారు. అమెరికా లో ఉన్నన్ని రోజులు మోడీ బిజీ బిజీ గా గడిపారు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో మోడీ మీటింగ్ తో మంచి ఫలితాలు వచ్చాయి.  పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ సహకార ఒప్పందాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించడం, తీరప్రాంత రక్షణలో సహకారానికి సంబంధించిన ఒప్పందం, సెక్యూరిటీ, టెక్నాలజీ, అంతరిక్షం, ఆరోగ్యం.. ఇలా….అనేకరంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలు మోడీ టూర్ లో కీ ఎలిమెంట్స్. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, అతడి వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేయడం ఇకపై ఇండియా, అమెరికాల జాయింట్ టార్గెట్. టెర్రరిస్టు సంస్థలకు స్థావరాలుగా ఉన్నవాటిని నాశనం చేయాలని మోడీ పర్యటనలో ఇరుదేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దక్షిణాసియా, పశ్చిమాసియాల్లోని టెర్రరిజంమీద కూడా రెండుదేశాల నేతలు చర్చించారు. టూర్ ముగించుకొని వచ్చిన మోడీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో  కేంద్ర మంత్రులు, అధికారులు వెల్కమ్ చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy