ఢిల్లీ టూర్: కేంద్రానికి ఎంపీల వినతులు

kavitha-gadkariఢిల్లీలో కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఈ మీటింగ్ కు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్, సోమేశ్ కుమార్ కూడా హాజరయ్యారు. జీఎస్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మినహాయింపు నివ్వాలని మంత్రి, ఎంపీలు జైట్లీని కోరారు. సంక్షేమ పథకాలపై జీఎస్టీని మినహాయించాలని కోరారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగ కలిశారు టీఆర్ఎస్ ఎంపీ కవిత, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు. బిజీ టైమ్ లో తమకు అవకాశం కల్పించినందుకు ట్విట్టర్ లో థాంక్స్ చెప్పారు కవిత.

మరోవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కలిశారు ఎంపీ కవిత. జగిత్యాలలో పలు బైపాస్ రోడ్డులను నిర్మించాలని అడిగారు. నిజామాబాద్ – ధర్మపురి 63వ నేషనల్ హైవేపై చల్ గల్ నుంచి పొలాస మధ్యలో బైపాస్ రోడ్డు వేయాలని అడిగారు. నిజామాబాద్- కరీంనగర్ రూట్ లో.. చల్ గల్ – అంతర్ గాన్ – దారూర్ – రాజారాం  గ్రామాల మీదుగా బైపాస్ రోడ్డు వేయాలన్నారు. జగిత్యాలను నేషనల్ హైవేకు కలుపుతూ.. దారూర్, నర్సింగాపూర్, పొలాస గ్రామీల మీదుగా.. మూడో బైపాస్ రోడ్డు వేయాలని గడ్కరీని కోరారు.

లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇవాళ సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. నిజామామాద్ ఎంపీ క‌విత, త‌మ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యేల‌తో స్పీక‌ర్ మ‌హాజ‌న్‌ను పార్ల‌మెంట్‌లో క‌లిశారు. ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా సుమారు 400 మంది మ‌ర‌ణిస్తున్నారు. అయితే హెల్మెట్‌పై అవగాహ‌న పెంచాల‌న్న ఉద్దేశంతో ఎంపీ క‌విత సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ అనే ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దానిలో భాగంగానే ఇవాళ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాఖీ పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి ఆడ‌ప‌డుచు అన్న‌య్య‌ల‌కు రాఖీతో పాటు హెల్మెట్‌ను బ‌హూక‌రించాల‌న్నారు. ఎంపీ క‌విత నిజామాబాద్‌కు చెందిన ఆరు మంది ఎమ్మెల్యేల‌తో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా క‌లిశారు.

ఇదిలా ఉంటే ఈనెల 11న జరిగే తన కొడుకు పెండ్లికి రావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి. పార్లమెంట్ లోనే ఎంపీ కవితకు కూడా పెండ్లి పత్రిక ఇచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy