ఢిల్లీ తిరిగొస్తున్నమోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యారు. ఐదు రోజుల అమెరికా టూర్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోని… ఇండియా ఫ్లైట్ ఎక్కారు.

టూర్ లో హైలైట్స్….

  • వాషింగ్టన్ లో ఒబామా, మోడీ రెండుగంటలపాటు సమావేశమై అనేక అంశాలపై కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
  • టెర్రరిజంపై ఉమ్మడి చర్యలు తీసుకోవడంతో పాటు టెర్రరిస్ట్ సంస్థల్ని నాశనం చేయాలని కూడా ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు.
  • ఇండియాలో మూడు స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు అమెరికా సాయం చేస్తుందని ఒబామా మోడీకి హామీ ఇచ్చారు.
  • ఒబామా ఇచ్చిన పార్టీలో మోడీ కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగారు. వైట్ హౌస్ లో జరిగిన పార్టీలో స్పెషల్ ఐటమ్స్ చాలా ఉన్నా దసరా ఉపవాస దీక్ష సందర్భంగా మోడీ ఎలాంటి ఫుడ్ ను తీసుకోలేదు.
  • కుటుంబ సమేతంగా ఇండియా రావాలని ఒబామాను మోడీ ఇన్వైట్ చేశారు.
  • వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్ లో ఇండో అమెరికన్లు మోడీకి గుడ్ బై చెప్పి మరీ ఫ్లైట్ ఎక్కించారు.
  • ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకోనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy