ఢిల్లీ సీఎం వర్సెస్ ఢిల్లీ గవర్నర్

arvind-najeebఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య ఓపెన్ వార్ కంటిన్యూ అవుతోంది. పాలన వ్యవహారాల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తలదూర్చడం తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటుండడంతో కేజ్రీ మండిపోతున్నారు. తాజాగా చీఫ్ సెక్రటరీ అపాయింట్ మెంట్ వీరి మధ్య మంటల్లో పెట్రోల్ పోసింది. సీఎంగా ఉన్న కేజ్రీని కన్సల్ట్ చేయకుండానే కొత్త సీఎస్ ను అపాయింట్ చేశారు నజీబ్ జంగ్. 1984 బ్యాచ్ IAS అధికారిణి శకుంతల గామ్లిన్ ను ఇంచార్జీ చీఫ్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న కేకే శర్మ వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో శకుంతల గామ్లిన్ ను నియమించారు నజీబ్ జంగ్. ఆమెకన్నా సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా వారిని పక్కనబెట్టారు. దీంతో జంగ్ తీరుపై కేజ్రీ అండ్ కో కోపంతో ఉంది. ప్రజల మద్దతుతో ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా లెఫ్ట్ నెంట్ గవర్నర్ వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక గతేడాది రైల్వేభవన్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన కేసులో కోర్టులో హాజరయ్యారు కేజ్రీవాల్. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో ముగ్గురు ఆప్ నేతలు కూడా కోర్టుకు వచ్చారు. కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు తమకు అందలేవని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పూర్తి పత్రాలతో పాటు సీడీలను వారికి అందజేయాలని కోర్టు దర్యాప్తు అధికారులను ఆదేశించింది. అయితే వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న కేజ్రీ రిక్వెస్ట్ ని కోర్టు రిజెక్ట్ చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 4 కు వాయిదా వేసింది. మరోవైపు ఆప్ సీనియర్ లీడర్ కుమార్ విశ్వాస్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఇష్యూ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. ఇల్లీగల్ రిలేషన్ షిప్ వార్తలను ఖండించనందుకు ఓ మహిళా కార్యకర్త కుమార్ విశ్వాస్ పై మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. దీంతో తమ ముందు హాజరై ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాలని ఈ నెల 4, 6 తేదీల్లో కుమార్ విశ్వాస్ కు నోటీసులిచ్చింది మహిళా కమిషన్. ఇక ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి బర్ఖాసింగ్ ను తొలగించాలని కేజ్రీ సర్కార్ డిసైడైనట్టు తెలుస్తోంది. పదవి నుంచి ఎందుకు తొలగించరాదో తెలియజేయాలని బర్ఖాసింగ్ ను షోకాజ్ నోటీసులిచ్చింది ప్రభుత్వం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy