ఢిల్లీ @ 90 YEARS

new delhiదేశ రాజధాని న్యూ ఢిల్లీ 90వ బర్త్ డే జరుపుకుంటోంది. శతాబ్దాల పాటు రాజులు పరిపాలించిన హస్తినాపురం.. దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి.  ఒకప్పటి హస్తిన… బ్రిటీష్ పరిపాలనలో ఢిల్లీగా మారింది. ఈస్టిండియా కంపెనీతో ఇండియాలో అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్లు… మొదట కలకత్తా కేంద్రంగా పరిపాలన సాగించారు. రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను మరింత ఈజీగా నడిపేందుకు .. ఢిల్లీని సెంటర్ గా మార్చుకున్నారు. ఐదో కింగ్ జార్జి, క్వీన్ మేరీ… ఢిల్లీ దర్బార్ నిర్వహించి రాజధానిని మార్చుతున్నట్టు ప్రకటించారు.

1926లో న్యూఢిల్లీగా నామకరణం

1911, డిసెంబర్ 12న కొత్తనగరానికి శంకుస్థాపన చేశారు. మొదట్లో  పేరు నిర్ణయించలేదు. తర్వాత… 1926 డిసెంబర్ 31వ తేదీన కొత్త రాజధానికి న్యూ ఢిల్లీ అని పేరు పెట్టారు కింగ్ జార్జ్. అలా… న్యూఢిల్లీ ఏర్పడి 89 ఏళ్లు పూర్తవుతోంది. ఇంతలోనే.. నగరం కాలుష్యంతో నిండిపోయింది. న్యూ ఢిల్లీ ఏర్పడిన రోజునుంచే కార్ పూలింగ్ విధానాన్ని ఆమ్ ఆద్మీ సర్కారు ప్రవేశపెట్టింది. రూల్స్ పాటించనివారికి 2వేల జరిమానా విధిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy