ఢీ కొన్న ఇసుక లారీ.. ఉప సర్పంచ్ మృతి

lorry-accidentపెద్దపల్లి జిల్లాలో ఇసుక లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఉప సర్పంచ్ చనిపోయాడు. దీంతో ఆ గ్రామస్థులు ఆగ్రహంతో రెచ్చి పోయి ఇసుక రవాణ చేసే లారీపై దాడికి పాల్పడ్డారు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై దాదాపు ఐదుగంటల పాటు జరిగిన ఆందోళనతో 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ ఎస్సీ కాలనీ సమీపంలో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం(ఏప్రిల్-22) సాయంత్రం ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆదివారంపేట ఉపసర్పంచ్‌ ఎరువాక రాజయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లడంతో, కొద్దిదూరంలో పట్టుకున్న స్థానికులు ఆ లారీ అద్దాలు, లైట్లను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో వెనుక ఆగి ఉన్న సుమారు 200 లారీల అద్దాలు, లైట్లను కూడా ధ్వంసం చేశారు. మృతదేహంతో బైఠాయించి ఐదు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు.

రాజాపూర్‌కు చెందిన రాజయ్య(65 ) గ్రామ ఉప సర్పంచ్‌. మరో వ్యక్తితో కలసి బైక్ పై బేగంపేట వైపు పొలం దగ్గరకు బయలు దేరాడు. అదే సమయంలో మంథని నుంచి వస్తున్న ఇసుక లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రాజయ్య తలకు బలమైన గాయౖ మె అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న మరో వ్యక్తికి గాయాలు ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ తరలించారు. లారీలను నియంత్రించాలని, మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy