తండాకు కీడంటూ డబ్బులతో ఉడాయించిన దొంగ బాబా

WhatsApp Image 2017-07-15 at 5.19.26 PMతండా వాసులకు కీడు ఉందని చెప్పి, పూజలు చేయాలంటూ అధిక మొత్తంతో ఉడాయించాడు ఓ దొంగ బాబా. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం లింగ్యాతండాలో జరిగింది. తండాలో నివసిస్తున్న అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకున్న ఓ బాబా..తండా వాసులకు కీడు ఉందని, పూజలు చేయాలని ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేసి ఉడాయించాడు. తర్వాత రెండు రోజులైనా కనిపించని ఆ బురిడి బాబాపై పెద్దల సాయంతో తండా వాసులు కురవి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  తాము ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును ఆ బాబా దోచుకెళ్లాడని.. ఎలాగైనా ఆ దొంగ బాబాను పట్టుకుని తమ సొమ్ము ఇప్పించాలను బాదితులు పోలీసులను కోరుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy