తండాలన్నీ అద్దాల్లాగా మెరిసిపోవాలి : కేసీఆర్

Untitledఎన్నో రోజులుగా ఉన్న లంబాడీల కోరికను అసెంబ్లీలో నెరవేర్చుకున్నామన్నారు సీఎం కేసీఆర్. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు శుక్రవారం (మార్చి-30) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు లంబాడ నేతలు.   లంబాడీలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక దత్తతకు ఇచ్చేవారని, గిరిజన బిడ్డల కష్టాలు తనకు తెలుసన్నారు. ఉద్యమసమయంలోనే తాను లంబాడీలకు న్యాయం చేయాలని డిసైడ్ అయ్యానని, తండాలను గ్రామ పంచాయతీలను చేసి చూపించామన్నారు. దీంతో తెలంగాణలో ఘననీయమైన మార్పు వచ్చిందని, దీంతో 100 శాతం గిరిజన సర్పంచులకు అధికారం ఉండే అవకాశం ఉంటుంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలని కాపాడతానని, తండాలకు డబ్బు డైరెక్టుగా వస్తుందన్నారు.

గ్రామ పంచాయతీల కోసం అసెంబ్లీలో అధికమొత్తం బడ్జెట్ ను కేటాయిస్తామని, దీంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బడికి పోవాలని, ఇందుకోసం గురుకులాలల్లో మంచి సౌకర్యాలున్నాయని తెలిపారు. చదువుకోని నిరక్ష్యరాస్యులుగా ఉన్నవారికి వ్యవసాయ రుణాలు ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రజలు కష్టాలు పడకూడదనే తన లక్ష్యం అన్నారు. ఇందుకోసం సర్పంచ్ చొరవ తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ప్రతి ఇంటి కష్టం ఏంటో సర్పంచ్ చూడాలని, ఖచ్చితంగా అందుకుతగ్గట్టుగా పనులు జరగాలన్నారు. 70 ఏళ్లుగా జరిగిన పాలనలో ఒరిగిందేమీలేదని, ఇకపై అభివృద్ధివైపు పరుగులు తీయాలన్నారు. మనం బాగు పడాలంటే మనమే మేల్కోవాలి, అంతేకానీ..పక్కింటివాడు వచ్చి, పని చేయడని సూచించారు.

పంచాయతీల కోసం కనీసం 3 లక్షలు ఇస్తామని, వచ్చిన నిధులను గ్రామాల్లో పనులు జరిపించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం 16వేల కోట్లు మనకు వస్తున్నాయని, అందుకే మనం తెలంగాణ తెచ్చకున్నామని వివరించారు.  కల్యాణ లక్ష్మీతో తండాలబిడ్డల పెళ్లిళ్లు జరుగుతున్నాయని, ఇది దుర్వినియోగం జరగకూడదన్నారు. ఆడ బిడ్డ పెళ్లి చేస్తే ఆ కుటుంబం దివాలాకాకూడదనే ఈ స్కీం పెట్టామన్నారు. సబ్ ప్లాన్ నిధులతో తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన కేసీఆర్.. గతంలో పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇకనుంచి తండాలు అద్దాల్లాగా మెరిసిపోవాలని, ఐదారేళ్లలో గిరిజన బిడ్డల జీవితాలు మారుతాయన్నారు. 2 వేల 601 గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. పేదల కష్టాలు ధనవంతులు ఎప్పుడు తీర్చరని, పేదల కష్టాలు పేదలే తీరుస్తారన్నారు. పేదరికం నిజంగానే తీసేయాలని, కంకణం కట్టుకోవాలన్నారు. మన తండా..మన ప్రణాళిక అనే ఓ కార్యక్రమం పెట్టుకోవాలని, దీనిద్వారా తండాల స్థితిగతులు తెలుస్తాయన్నారు. సమస్యలు ఎంటో రికార్డులు చేసి, వాటిని సత్వరమే పరిష్కరించాలన్నారు.


.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy