తండ్రికి చేదోడు వాదోడుగా…

ivanka-trump-11అమెరికా ప్రెసిడెంట్ అడ్వైజర్ గా ఇవాంక వైట్ హౌస్ లో అడుగుపెట్టడం.. ట్రంప్ కు కలిసొచ్చింది.  దేశ, విదేశీ వ్యవహారాల్లో ఆమె కీ రోల్ పోషిస్తోంది.  కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి స్పీచ్ దగ్గర నుంచి… ఆయన విదేశీ పర్యటనల దాకా ఆమే ప్లాన్ చేసింది. పైసా జీతం తీసుకోకుండా వైట్ హౌస్ లో పనిచేస్తూ తండ్రికి సాయం చేస్తోంది ఇవాంక.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యవహారాల్లో సలహాలు ఇస్తోంది కూతురు ఇవాంకా ట్రంప్.  మొదట్లో దూకుడుగా ఉన్న ట్రంప్ … కాంగ్రెస్ నుద్దేశించి చేసిన ప్రసంగంలో  కాస్త నెమ్మదించారు. దీనికి ఇవాంకానే కారణమని తేలింది.  వారం రోజుల ముందు నుంచే ట్రంప్ ప్రసంగంపై వైట్ హౌస్ లో జరిగిన చర్చల్లో ఇవాంక పాల్గొంది. మంత్రులు, అధికారులతో కలసి స్పీచ్ ప్రిపరేషన్ చేసింది.

కాంగ్రెస్ ప్రసంగం తర్వాత … ట్రంప్ పాలన వ్యవహారాల్లో ఇవాంక ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ వచ్చింది.  జపాన్, కెనడా ప్రధానులు, జర్మనీ చాన్సలర్ వచ్చినప్పుడు కూడా ఇవాంకానే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.  ట్రంప్ అద్యక్షుడు కాకముందు ఆమె ఫ్యాషన్ బిజినెస్ లో ఉన్నారు. వాటిని కూడా వదిలిపెట్టి పూర్తిస్థాయిలో తండ్రికి సాయపడుతున్నారు. విదేశాల్లో జరిగే కీలక మీటింగ్ లకు కూడా అమెరికా తరపున ఇవాంక వెళ్తున్నారు. ఇంత కీలకంగా వ్యవహరిస్తున్న ఇవాంక మాత్రం పైసా జీతం తీసుకోకుండా పనిచేస్తోంది.  ఆమె భర్త జారెద్ కుష్నర్  కూడా ట్రంప్ కు సీనియర్ అడ్వైజర్. ఆయన కూడా జీతం లేకుండానే పనిచేస్తున్నారు.

జీతం లేకుండా పనిచేస్తున్న ఇవాంకకి… వైట్ హౌస్ లో ప్రత్యేక ఆఫీస్ కూడా ఉంది. గవర్నమెంట్ సీరిస్ లో ఉన్న ఫోన్, కంప్యూటర్ సిస్టమ్ కూడా ఇచ్చారు.  అంతకుముందు ఆమె అనధికారికంగా పాలనలో జోక్యం చేసుకుంటోందంటూ విమర్శలు వచ్చాయి. దాంతో ట్రంప్  యంత్రాంగంలో ఓ ఫెడరల్  ఉద్యోగిగా జీతంలేని సలహాదారుగా చేరుతున్నట్టు ఇవాంక ప్రకటించగానే… ఆమెపై విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy