తక్కువ బరువు ఉండే సరికొత్త ల్యాప్ టాప్

download Acer Aspire E1-510 windows 8 driversఏసర్ కంపెనీ తక్కువ బరువు ఉండే సరికొత్త ల్యాప్ టాప్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. Aspire E1 అని దీనికి పేరు పెట్టింది . దీని బరువు 2.2 కేజీలు  మాత్రమే . తేరా పరిమాణం 15.6 అంగుళాలు. దీనియొక్క కాన్ఫిగరేషన్ విషయానికొస్తే డ్యూయల్ కోర్ ఇంటెల్ సెల్రాస్ ప్రాసెసర్ (ఫోర్త్ జెనరేషన్) ని వాడారు. ర్యామ్ 2 జీ.బి . హార్డ్ డ్రైవ్ సామర్ద్యం 500 జీ.బి. టైపింగ్ కి అనువుగా ఉండేలా chicklet స్టైల్ లో కీబోర్డ్ ని రూపొందించారు. Gesture సపోర్ట్ తో ట్రాక్ పాడ్ ఉంది. హెచ్.డి వెబ్ కెమెరా , హెచ్ డి ఎం ఐ, ఈథర్నెట్ , యూఎస్ బి 3.0 పోర్ట్. యూ ఎస్ బి 2.0 పోర్ట్ , కార్డు రీడర్ , డీవీడీ రైటర్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. ఇన్ బిల్ట్ ఓ.ఎస్ లేకుండా ల్యాపి ధర రూ.20,999. విండోస్ 8.1 ఓ.ఎస్ తో కావాలనుకుంటే ధర రూ. 26,500.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy