తగ్గిన చంద్రబాబు బ్యాంక్ బ్యాలెన్స్

41443254300_625x300ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించారు టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్. బాబు ఆస్తుల్లో గతేడాదికి ఈ ఏడాదికి పెద్ద మార్పులేదని 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిందన్నారు. ఆస్తులు ప్రకటించడమనే సాంప్రదాయాన్ని చంద్రబాబు మొదలు పెట్టారని… ఆ సంప్రదాయాన్ని ఎన్నికల కమిషన్ కూడా ప్రసంశించిందన్నారు. ఆస్తుల ప్రకటన తర్వాత తమపై ఆరోపణలు వచ్చే అవకాశముందని.. అయితే వాటికి ఆధారాలు కూడా చూపాలని సవాల్ చేశారు.  తమ ఆస్తుల వివరాలను ట్విట్టర్ పెట్టారు లోకేశ్.  హెరిటేజ్ ఆస్తులు 2072 కోట్లని.. 2013 -14 ఆర్థికసంవత్సరంలో ఆదాయం 273 కోట్లు ఉండగా..  30 కోట్లు లాభం వచ్చిందని తెలిపారు. 17 ఏళ్లుగా తెలంగాణలో హెరిటేజ్ ఉందని.. రాష్ట్రప్రభుత్వానికి 30 – 40 కోట్ల ట్యాక్స్ కడుతున్నామన్నారు. రాజకీయ ఆరోపణలకు జవాబివ్వాల్సిన అవసరం లేదన్నారు. హుద్ హుద్ బాధితులకు హెరిటేజ్ సంస్థ ద్వార సాయమందించామన్నారు. తమ ముఖ్య ఆదాయవనరు హెరిటేజ్ అన్న ఆయన.. సంస్థ నిర్వహణలో ఎంతో సంతోషాన్ని తమ కుటుంబం పొందుతుందన్నారు.

26br95add1

 

26br95add2

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy