తగ్గేది గోరంత.. పెరిగింది కొండంత : మధ్యతరగతిపై GST బాదుడు

middleclass-gstసామాన్య, మధ్య తరగతిపై GST భారం తప్పదా.. తగ్గే ధరలతో పోల్చుకుంటే.. పెరిగింది కొండంతగా ఉందా.. నెలవారీ బడ్జెట్ చూస్తే ఇదే చెబుతోంది. నెలవారీగా ఇంట్లోకి వచ్చే సరుకులు ధరలు అతి స్వల్పంగా రూపాయల్లో తగ్గితే.. మిగతావి వందల్లో పెరగటం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారం కాబోతున్నది. భార్య, భర్తతోపాటు ఇద్దరు పిల్లల ఫ్యామిలీ నెలకు 25 నుంచి 30వేల రూపాయలు సంపాదిస్తుంటే.. వారిపై ఎలాంటి భారం పడుతుంది. ఎంత లాభం – ఎంత భారం అనేది ఉదాహరణగా లెక్కలేసి చూద్దాం..

నిత్యావసరాలు :

ఒంటి సబ్బులు ఓ ఆరు కొనుగోలు చేస్తే 240 అవుతుంది. GSTలో 21 రూపాయలు ఆదా అవుతుంది. బట్టల సబ్బులు ఓ 8 కొనుగోలు చేస్తే 180 అనుకుంటే.. ఇక్కడ రెండు రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. ఇక షాపూ ఓ బాటిల్ 200 రూపాయలకు కొనుగోలు చేస్తే 2 రూపాయలు పెరిగింది. కిలో వాషింగ్ పౌడర్ 150 కొనుగోలు చేస్తే రెండు రూపాయలు పెరిగింది. పేస్ట్ వంద రూపాయలు అనుకుంటే ఆదా అయ్యేది రూ.9.

అంటే సబ్బులు, వాషింగ్ పౌడర్, షాంపూ దగ్గర మీకు ఆదా అయ్యేది కేవలం రూ.25 మాత్రమే.

బియ్యం 25Kg, కందిపప్పు 2 Kg, మినపప్పు 2Kg, పంచదార 2 Kg, వంట నూనె 2 Kg, చట్నీపప్పు Kg, పెసరపప్పు Kg, వేరుశనగపప్పు Kg, గోధుమ పిండి 3Kg, ఇడ్లీరవ్వ 2 Kg, బొంబాయ్ రవ్వ 2 Kg, కాఫీ 100 గ్రాములు, టీ పౌడర్ 250గ్రాములు, పిల్లలు ఉంటారు కాబట్టి బూస్ట్ లాంటివి ఓ కేజీ తీసుకుంటే.. మొత్తంగా మీ నిత్యావసరం బడ్జెట్ వీటి వరకే 3వేల రూపాయలు అవుతుంది. జూలై ఒకటి నుంచి GST రేట్ల ద్వారా మీ ఆదా చేసేది ఎంతో తెలుసా.. అక్షరాల రూ.116. పైన సబ్బులు, షాపూతో మిగిలేది కలుపుకుంటే.. 141 రూపాయలు మీకు మిగులు అవుతుంది. ఇది ఓ మధ్య తరగతి బడ్జెట్ అంచనా ప్రకారం మాత్రమే. మార్కెట్ లోని యవరేజ్ ధరలను తీసుకుంటే మాత్రమే. ఇది గమనించాలి.

ఇంటిల్లపాది సెల్ ఫోన్ బిల్లు రూ.వెయ్యి ఖర్చు చేస్తుంటే.. 30 అదనంగా చెల్లించాలి. రూ.500 ఇంటర్నెట్ బిల్లుకు అదనంగా 15 రూపాయలు చెల్లించాలి. కేబుల్ బిల్లుకు 10 అదనం. మల్టీఫ్లెక్సుల్లో నెలకు మొత్తం ఫ్యామిలీ సినిమా చూస్తే ప్రస్తుతం అవుతున్న ఖర్చు కంటే అదనంగా 200 రూపాయలు అవుతుంది. ఇవన్నీ కూడా ఇల్లు అన్నాక కామన్ కాబట్టి.. ప్రస్తుతం మీరు వీటిపై చేస్తున్న ఖర్చు కంటే అదనంగా 255 రూపాయలు అవుతుంది.

కేవలం రోజువారీ కచ్చితమైన అవసరాల్లోనే GST పరిధిలోకి వచ్చిన తర్వాత 114 రూపాయలు అదనంగా భరించాల్సి వస్తుంది. ఇక బైక్ ఉంటే దానికి రిపేర్ వస్తే ప్రస్తుతం కంటే అదనంగా ఒక శాతం, ఇన్సూరెస్ కు 3శాతం, క్రెడిట్ కార్డు బిల్లలపై 3శాతం అదనం.

ఇప్పుడు చెప్పండి.. 25, 30వేల జీతం సంపాదించే సామాన్య, మధ్యతరగతి జనంపై భారం పెరిగిందా.. తగ్గిందా.. వంటింట్లో తగ్గిన గోరంత లాభం ఏమోగానీ.. మిగతా వాటికి చెల్లించేది మాత్రం కొండంతగా ఉంది. జై GST.. జై జై GST..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy