హైదరాబాద్ లో ముసురు : రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు

Hyderabad-inside

పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంల అల్పపీడనం ఏర్పడింది. ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాన్ని అనుకొని తీవ్ర అల్పపీడనం ఉంది. రాబోయే 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఒడిశా, కోస్తాంధ్రలొ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదిలి తెలంగాణ వైపు వచ్చే కొద్దీ.. వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు.

హైదరాబాద్ లో ముసురు

ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ముసురు పట్టింది. ఉదయం నుంచి వర్షం పడుతునే ఉంది. దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, సైదబాద్, సంతోష్ నగర్ లో చిరు జల్లులు పడుతున్నాయి. బషీర్ బాగ్, నారాయణగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి ఏరియాల్లో వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ తో పాటు పటాన్ చెరుల వర్షం పడుతోంది. ముసురు పట్టడంతో జనాలు ఇళ్లల్లో నుంచి బయటికి రావడంలేదు.

ఖమ్మంలో కుండపోత

ఖమ్మంలో కుండపోత వర్షం పడుతుంది. నగరం తడిసి ముద్దవుతోంది. కమాన్ బజార్, హాట్ స్పాట్ సెంటర్, జెడ్పీ, బస్టాండ్ సెంటర్లలో రోడ్లు జలమయం అయ్యాయి. కరెంట్ సరఫఱా నిలిపి వేశారు అధికారులు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నరు. పాల్వంచల రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బూడిద వాగుకు భారీగ వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. పాల్వంచ, దమ్మపేట రోడ్డు మీద వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నరు. భారీగ కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి భారీగ వరద నీరు వచ్చి చేరుతుంది.

కరీంనగర్ లో వానలే వానలు

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలల్ల రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడుతున్నయి. కరీంనగర్, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంటల వర్షం పడుతుంది. జగిత్యాలలో చిరు జల్లులు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాలు బాగా పడతుండడంతోటి కొన్ని ఏరియాల్లో  చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి.

నిజామాబాద్ జలమయం

నిజామాబాద్ నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 48గంటల నుంచి వర్షం పడుతుంది. కొన్ని ఏరియాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇన్ని రోజుల జిల్లాల చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. ఇప్పుడు పడుతున్న వర్షాలతోటి రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకి వరద నీరు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy