తనను కాపాడిన పోలీస్ ను.. 18 ఏళ్లకు కలుసుకుంది

America-fire-అమెరికాలో 18 ఏళ్ల క్రితం ఓ భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానికట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి.. సమాచారం అందుకున్న పోలీస్ మ్యాన్ పీటర్ గేజ్.. ఆ భవనంలో స్పృహతప్పి పడిపోయి ఉన్న 5 ఏళ్ల పాపను వేగంగా చేతుల మీద తీసుకొచ్చి.. హాస్పిటల్ కు తరలించారు.

1998లో జరిగిన అగ్రిప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఆ 5 ఏళ్ల పాప.. 18 ఏళ్ల అనంతరం తనను రక్షించిన పోలీసాఫీసర్ పీటర్ గేజ్ కోసం వెతికింది. అడ్రస్ కనుక్కొని.. ఆ దుర్ఘటనలో తన ప్రాణాలను కాపాడిన ఆ పోలీసాఫీసర్ ను కలుసుకొని తన కృతజ్ఞతను తెలుపుకుందామె. రీసెంట్ గా డిగ్రీని అందుకున్న జోసిబెక్ అపోంటే ఆ పోలీసాఫీసర్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy