తమిళనాడుకు కావేరీ నీరు ఇవ్వాల్సిందే: సుప్రీం

cauvery-కావేరీ జలాల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం(మే-3) తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన అర్జీని విచారణ చేసింది. అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం వెంటనే తమిళనాడుకు 4 TMCల కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. కావేరీ నీరు పంపిణి విషయంలో, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు మండిపడింది. కార్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 10 రోజుల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

కర్ణాటక తమిళనాడుకు ఎన్నిTMCల కావేరీ నీరు విడుదల చేసింది, కర్ణాటకలోని జలాశయాల్లో ఎన్ని TMCల నీరు ఉంది అనే పూర్తి సమాచారంతో వచ్చే మంగళవారం లోపు అఫిడవిట్ సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు కేసు విచారణ మే 8వ తేదీ మంగళవారంకు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించాల్సి ఉంది. అదే సమయంలో కావేరీ నీరు వదిలితే బెంగళూరు నగర ప్రజలతో పాటు మండ్య, మైసూరు జిల్లా రైతులు ఎన్నికల్లో సినిమా చూపిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడుకు నాలుగు TMCల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని డెల్టా ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు కావేరీ నీరు వదిలితే వేసవి కాలంలో తాము తాగునీరుకు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని బెంగళూరు నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అయితే దీనిపై స్పందించిన కేంద్రప్రభుత్వం….కావేరీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయలేకపోతున్నామని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రులు ఉండటంతో ఈ అంశంలో జాప్యం జరుగుతోందని కోర్టుకు నివేదించింది. కేంద్రం తీరుపై తమిళనాడు తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫడే అభ్యంతరం వ్యక్తం చేశారు.కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని..ప్రభుత్వం కర్ణాటకలో ఎన్నికల భవితవ్యంపై ఆందోళన చెందుతోందని అన్నారు. కర్ణాటక ఎన్నికలు మే 12న జరుగుతాయని, అప్పటివరకూ కావేరీ జలాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy