తమిళనాడులోకి ఎంటర్ అయిన రామ రథయాత్ర… అడ్డుకోవాలన్న స్టాలిన్

ramఅయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ చేస్తున్న రామ రథయాత్ర తమిళనాడులోకి ప్రవేశించింది. ఆ యాత్రను అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రథయాత్రతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు, మత సామరస్యానికి ఇబ్బందని స్టాలిన్ ఆందోళన చెందారు. వీహెచ్ పీ రథయాత్రను అడ్డుకుంటామని తిరునల్వేలిలో కొందరు ప్రకటించారు. దాంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు తమిళనాడు పోలీసులు. ఈనెల 23 దాకా ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy