తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

road accidentతమిళనాడులోని తిరునెల్వేలిలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా గుర్తించారు పోలీసులు . ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy