రోశయ్యకు హైకోర్టులో ఊరట

Rosaiah123తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. సీఎంగా ఉన్న సమయంలో అమీర్ పేట ప్రాంతంలోని ల్యాండ్ ఇష్యూలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనపై నమోదు అయిన కేసులను కొట్టేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అభ్యర్థనకు అనుమతి ఇచ్చింది హైకోర్టు.

తమిళనాడు గవర్నర్,  ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో అమీర్ పేట ప్రాంతంలో 200 కోట్ల విలువ చేసే… 9 ఎకరాల భూ బదలాయింపు వ్యవహరంలో ఆయనపై నమోదైన కేసులను కొట్టేసింది హైకోర్టు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని రోశయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు అనుమతి లభించింది.

అమీర్ పేట మైత్రివనం సమీపంలో ప్రజావసరాల కోసం 9.14 ఎకరాల ల్యాండ్ ను సేకరించింది అప్పటి ప్రభుత్వం. ఇందుకోసం భూ యజమానులకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఆ తర్వాత రోశయ్య సీఎంగా ఉన్న సమయంలోనే సేకరించిన భూమిని యజమానులకు ఇస్తున్నట్టు 2010లో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. భూమి వాపసు ఆర్జీపై సీఎంగా రోశయ్య సంతకం కూడా ఉంది. దీంతో ఈ విషయాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. భూమి తిరిగి ఇచ్చే వ్యవహారంలో అవకతవకలు జరిగాయని… ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోర్టుకు తెలిపారు ఏసీబీ అధికారులు. రోశయ్యతో పాటు మరో 14 మందిపై అవినీతి కేసులు నమోదు చేశారు అధికారులు. ఇన్ని సంవత్సరాలు ల్యాండ్ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొన్న రోశయ్య… తనపై నమోదు అయిన కేసుల నుంచి తప్పించాలని క్వాష్ పిటిషన్ తో కోర్టుకు వెళ్లారు. దీంతో జస్టిస్ రాజా ఆధ్వర్యంలోని న్యాయస్థానం కేసులు కొట్టేవేసినట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy