తమిళ్ పాలిటిక్స్ లో కరీంనగర్ కీరోల్

tamil-polticesప్రస్తుతం తమిళనాడు రాజకీయ భవిష్యత్తు తెలంగాణ నాయకుల చుట్టూ తిరుగుతోంది. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయంపై అక్కడి నేతల రాజకీయ జీవితం ఆధారపడింది. తమిళ సంక్షోభాన్ని… గట్టేంక్కించేందుకు ఆ ఇద్దరూ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ తమిళ రాజకీయాలను శాసిస్తున్న ఆ వ్యక్తులు ఎవరో చూద్దాం…

తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో.. ఇప్పుడు అందరి కళ్లు కరీంనగర్ జిల్లాపై పడ్డాయి. జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ కీలక నేతలు తీసుకునే నిర్ణయంపై.. అక్కడి నేతల భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో… ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కాగా, మరొకరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. విద్యాసాగర్ రావు రాజ్యాంగ పదవిలో ఉంటే, మరళీధర్ రావు పార్టీ ప్రతినిధిగా తమిళనాడు ఇంఛార్జిగా ఉన్నారు. తమిళనాట నెలకొన్న సంక్షోభాన్ని పార్టీకి అనుకూలంగా మార్చేందుకు నేతలు కృషిచేస్తున్నారు.

పన్నీర్ సెల్వం, శశికళ మధ్య నెలకొన్న వివాదంలో…. తీర్పునిచ్చే అధికారం ఇప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావు చేతిలో ఉంది. ఆయన తీసుకునే నిర్ణయం మీదే అక్కడ ముఖ్యమంత్రి ఎవరన్నదీ తేలనుంది. బీజేపీలో సీనియర్ నేతగా, ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన విద్యాసాగర్ రావు… 2014 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అయితే మోడీకీ బాగా సన్నిహితునిగా మెలగడంతో… మహారాష్ట్ర గవర్నర్ గా, తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ గా కీలక పదవి దక్కింది. పార్టీలో ఎంతో విధేయునిగా పేరున్న విద్యాసాగర్ రావు.. ఇప్పుడు తమిళ రాజకీయాలను ఎటువైపు నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇక లిస్ట్ లో ఉన్న మరో కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు. ఈయన కూడా కరీంనగర్ జిల్లా వాసే. 2014లో కరీంనగర్ నుంచి బీజేపీ పార్లమెంట్ టికెట్ ఆశించినా… అధిష్టానం విద్యాసాగర్ రావుకు టికెట్ కేటాయించడంతో పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో మురళీధర్ రావుకు తమిళనాడు బీజేపీ ఇన్ ఛార్జ్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న వివాదాల నేపధ్యంలో… అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మురళీధర్ రావు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగనున్న క్రమంలో.. తమిళనాడు ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే కమలం పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి సీఎం పీఠంపైకి వచ్చేలా పావులు కదుపుతోందన్న వాదన వినిపిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy