తరగతి గది..తరగని నిధి: ఉపరాష్ట్రపతి

venkaiah

భారతమాత ముందు తెలుగు తల్లిని  స్మరించుకుంటానన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలుగును ఆస్వాదించి, ప్రావీణ్యం ఉండి, అభిమానం ఉండి తెలుగులో తమకు ఉన్న తెలివితేటలను ప్రదర్శించినప్పుడు మనస్సుకు సంతోషం కలుగుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన రెండో పదవిలో ఉన్నా.. తెలుగు అంటే తెలుగు నేలలంటే తనకు ఎంతో అభిమన్నారు. చిన్నప్పుడే తల్లిని కోల్పాయానన్న వెంకయ్యనాయుడు..తెలుగు భాషనే తల్లిగా భావిస్తుంటానన్నారు.

సీఎం కేసీఆర్‌ ఉపన్యాసం తనను ఎంతో సంతోష పరిచిందన్నారు. భోజనం ఎంత ఆలస్యమైనా తాను పట్టించుకోనని, కేసీఆర్‌ ప్రసంగంతో తన ఆకలి తీరిందంటూ చమత్కరించారు.

తరగతి గది.. ఎప్పటికి తరగని నిధిలానే ఉంటుందన్నారు ఉప రాష్ట్రపతి. గురువులను ఎన్నటికీ మర్చిపోకూడదని, గురువుకు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. మన  తెలుగు భాషను, యాసను కాపాడుకుందామన్నారు. తెలంగాణ, రాయల సీమ నుంచి, కోస్తా, ఉత్తరాంధ్ర వరకు వెళుతుంటే.. భాష ఒక్కటైనా.. రక రకాల యాసలు వినిపిస్తుంటామన్నారు. తెలుగు భాష ప్రాచీనమైనదని మనకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తెలుగు భాషకు మూలాలు కూడా లభిస్తాయి. భాష.. అభివృద్ధికి దారి తీస్తుందన్నారు.

మన భాష, సాహిత్యం, సంగీతం, సంస్కృతి పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయకపోతే తెలుగు భాష క్షీణించిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను.. పాలనా భాషగా, బోధనా భాషగా అమలు చేస్తే తెలుగు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని పాఠశాలలో, జూనియర్‌ కాలేజీల్లో తెలుగును తప్పనిసరిగా చేస్తూ తెలంగాణ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. భాషకు యాసకు సంబంధించిన నిఘంటువును రూపొందించాలన్నారు. తెలుగు సాంకేతిక విప్లవం అందుబాటులోకి రావాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy