తలకి గురిపెట్టి పేల్చాడు : మామిడి చెట్టు ఎక్కిన చిన్నారిపై కాల్పులు

mangoఒక చిన్నారి ప్రానం కన్నా నాలుగు మామిడి కాయలకే విలువైనవి భావించాడు ఓ కసాయి. చెట్టు నుంచి మామిడికాయలు కోశాడన్న కారణంతో 10 ఏళ్ల బాలుడిని కాల్చి చంపాడు ఓ దర్మార్గుడు. బీహార్ రాష్ట్రం కగరియా జిల్లాలో జరిగింది ఈ దారుణం.
బీహార్ రాష్ట్రం కగరియా జిల్లాలోని షెర్గర్ గ్రామంలో సత్యం కుమార్ అనే 10 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలసి ఓ మామిడి తోట దగ్గర ఆటలాడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆకలి వేయడంతో పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లాడు. ఆకలిని తీర్చుకోవడానికి చెట్టు ఎక్కి నాలుగు కాయలు కోశాడు. దీన్ని చూసిన తోట కాపాలాదారుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మామిడికాయలెందుకు కోశావ్ అంటూ ఆ చిన్నారి తలపై తుపాకీతో కాల్చాడు. స్ధానికులు చిన్నారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో చిన్నారి చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు.

తన కొడుకు చేసిన తప్పు.. కేవలం బాథో చౌదరికి చెందిన తోటలో నాలుగు మామిడికాయలు కోయడమేనని చిన్నారి తండ్రి మకుని యాదవ్ గుండెలు పగిలేలా ఏడ్చారు. విషయం తెలియడంతో వేలాదిమంది ప్రజలు అక్కడికి చేరుకుని నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ వాళ్లను అరెస్ట్ చేయలేదు. ఆ ఏరియాలో శాంతిభధ్రతలను కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy