తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడంలో.. హైదరాబాద్ టాప్

oldageనైతిక విలువలు.. ఉమ్మడి కుటుంబం.. పెద్దలపై తరగని ప్రేమ.. వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ మన భారతదేశం. కానీ.. అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులనే వృద్దాప్యంలో పట్టించుకోవడం లేదు నేటి తరం. అన్నింట్లో ముందుంటున్న హైదరాబాద్ మరో చెత్త రికార్డ్ సాధించింది. కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడంలోనూ సిటీయే టాప్ ప్లేస్ లో నిలిచింది. కంప్యూటర్ యుగంలో.. కన్నవారిని ఓల్డ్ ఏజ్ హోముల్లో వదిలేయడంతో పాటు.. వాళ్ల కనీస అవసరాలు తీర్చకుండా.. నిర్లక్ష్యం చేస్తున్నవారే అధికమని ఓ సర్వే రిపోర్ట్ చెబుతోంది. వృద్ధాప్యంలో.. పిల్లల ఆదరణ లేకుండా.. బతుకీడుస్తున్న పెద్దలే ఎక్కువున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పిల్లలు ఆదరించడం లేదని పెద్దవాళ్లు అంటుంటే.. ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉండే తమతో ఉండటానికి పేరెంట్స్ ఇష్టపడటం లేదంటున్నారు ఉద్యోగులు.

దేశంలోని మెట్రో నగరాల్లో ‘ హెల్ప్ ఏజ్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ… వృద్దులపై సర్వే నిర్వహించింది. పేరేంట్స్ ను నిర్లక్ష్యం చేస్తున్న వారిలో మన హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కనిపెంచిన తమ కొడుకులే వృద్దాప్యంలో.. నిర్లక్ష్యం చేస్తున్నారని 59.47 శాతం మంది వృద్ధులు పేర్కొన్నారు. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేయడం బాధాకరమంటున్నారు విద్యావేత్తలు.

వృద్దాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడంలో హైదరాబాద్ 60 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 59 శాతంతో రెండవ స్థానంలో గౌహతి, 52 శాతంతో మూడో స్థానంలో కోల్ కతా, 4వ స్థానంలో చెన్నై, ఐదవ స్థానంలోముంభై, ఆరవ స్థానంలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాలున్నాయి. ఈ జనరేషన్ పిల్లలు పెద్దల దగ్గర పెరిగితే సంస్కారంతో పాటు ప్రేమను నేర్పుతారంటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్లు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలంటున్నారు. వృద్దులను బాగా చూసుకునేవారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. నేటి యువత రేపటి వృద్దులనే విషయం మరిచి పోవద్దు. పేరేంట్స్ ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో మనం వృద్దులవుతామనేది గుర్తించుకుని వారిని ప్రేమతో చూడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy