తల్లిప్రేమ: చనిపోయిన బిడ్డకోసం

monkey
తల్లి ప్రేమను మరోసారి చాటి చెప్పింది తిరుమలలో జరిగిన ఓ ఘటన. మునుషుల్లో మాయమవుతున్న మానవత్వాన్ని తట్టి లేపుతోంది ఈ ఘటన. తిరుమలలో శేషాద్రినగర్ కాటేజి దగ్గర చెట్ల మీద ఎగురుతూ ప్రమాద వశాత్తు కింద పడి ఓ పిల్ల కొండ ముచ్చు చనిపోయింది. అది చూసిన తల్లి కొండ ముచ్చు.. తన బిడ్డ చనిపోయిందని గ్రహించలేక  లేపడానికి ఎంతో ప్రయత్నించింది. బిడ్డ కోసం తల్లి పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆ దృష్యాలను చూసిన వారు కంటతడి పెట్టారు. అంతే కాదు ఈ విషయం ఎలా తెలిసింది కానీ… మిగిలిన కొండముచ్చులు గుంపులుగా అక్కడికి చేరుకుని ఎవరినీ ఆ ఘటన జరిగిన ప్రాంతానికి రాకుండా అడ్డుకున్నాయి. సమాచారం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు చనిపోయిన కొండముచ్చు పిల్లను తిరుపతికి తరలించి ఖననం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy