తల్లి పాత్రకు ‘ఫిదా’ అయిన సాయిపల్లవి

SAI-PALLAVI‘ఫిదా’ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంది సాయిపల్లవి. ఈ ‘ప్రేమమ్’ హీరోయిన్ ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి ‘కణం’ సినిమాలో నటిస్తోంది. ‘కణం’ ట్రైలర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది సినిమాయూనిట్. హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నది. తమిళ్‌లో కరు టైటిల్‌తో రిలీజ్ కానుంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంతో సాయిపల్లవి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధంతో ‘కణం’ తెరకెక్కుతున్నది. ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో నటిస్తోందట. సాయిపల్లవి, నానితో కలిసి ఎంసీఏ సినిమాలో కూడా నటిస్తోంది. ఎంసీఏ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy