తారుమారు….

AC_Coach_in_Indian_Train
ఒకరు తగ్గిస్తుంటే మరొకరు పెంచుతున్నారు. హోలీ సందర్భంగా రైల్వే, విమానయాన సంస్థల రేట్లు తారుమారయ్యాయి. మామూలుగా తక్కువ ఛార్జీలు ఉండే రైళ్ళు బాదుడుకు సిద్ధమవుతుంటే……ఎక్కువ రేట్లు ఉండే విమానయాన సంస్థలు మాత్రం ఛార్జీలను తగ్గించాలని డిసైడ్ అయ్యాయి.
హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-జమ్మూ సెక్టార్ల మధ్య రెండు సూపర్ ఫాస్ట్ ప్రీమియమ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ చార్జీలను మాత్రం కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెంచేసింది. ఏకంగా 250 నుంచి 300 శాతం వరకు ఉండే అవకాశముంది. చివరి నిమిషంలో వీటిలో బుక్ చేసుకుంటే మాత్రం 2500 రూపాయల 2 టైర్ ఏసీ టిక్కెట్ ధర 7000 లేదా మరింత ఎక్కువ కూడా పెరగొచ్చు. వీటితో పోలిస్తే విమాన చార్జీలే తక్కువ. ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం సమకూరనుంది. డిమాండ్ ను బట్టి టిక్కెట్ల ధరను పెంచుతుంటామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి ఈ నెల 14, 16న ముంబైకి, 14, 16, 21న జమ్మూకు ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి.
మరోవైపు హోలీ సందర్భంగా స్పైస్ జెట్, ఇండిగో విమాన సంస్థలు తమ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. స్పైస్ జెట్ ఇప్పటికే తమ రేట్లను ఫిక్స్ చేశాయి. ఏప్రిల్ 14 నుంచి జూన్ 30 మధ్యలో ప్రయాణించాలనుకునే వారికి అతి చవక ధరలో టికెట్లను అందిస్తున్నాయి. కేవలం 1,999 రూపాయలతో ఒకవైపు ప్రయాణం చేయవచ్చును. అయితే ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈరోజు నుంచి మార్చి 16లోపు టికెట్లను బుక్ చేసుకోవాలి. అది కూడా సెలెక్టెడ్ రూట్స్ లో మాత్రమే. ఇక ఇండిగో రానున్న 5 రోజులలో ఫ్లాష్ సేల్ పేరిట 30 శాతం వరకు డిస్కౌంట్లను ఇవ్వనుందని ట్రావెల్ పోర్టల్స్ తెలిపాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy