తిరిగి ఇచ్చేస్తాం : రైతు బంధు సాయం వద్దంటున్న శ్రీమంతులు

rythu-bandhuమే 10వ తేదీ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక పథకానికి శ్రీకారం చుడుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఎకరాకి రూ.8వేల చొప్పున రెండు పంటలకు రెండు విడతల్లో అందించనుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న రైతు బంధు పథకానికి తమ వంతు సాయంగా ముందుకు వస్తున్నారు శ్రీమంతులు. ప్రభుత్వం ఇచ్చే రూ.8వేల పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు ముందుకు వస్తున్నారు. పేదలు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే ఈ పథకానికి మరింత సాయం అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తమ పేరుతోపాటు బంధువుల పేర్లపై ఉన్న భూములకు పెట్టుబడి సాయం తీసుకోకూడదని నిర్ణయించారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేయగా.. ఇప్పుడు మంత్రి పోచారం తన 30 ఎకరాల భూమికి వచ్చే రూ.2.40లక్షల సాయాన్ని స్వచ్చందంగా వదులుకున్నారు. అదే విధంగా ఎంపీ  పొంగులేటి శ్రీనివాసరెడ్డి 144 ఎకరాలకు రూ.11.52లక్షలు కూడా తిరస్కరించారు. రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు రూ.2.56లక్షలు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.11.20లక్షలు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రూ.6.96లక్షలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రూ.4లక్షలు వదులుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ రూ.3.44లక్షలు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా రూ.3.20లక్షలు, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.2.88లక్షలు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.1.60లక్షలు స్వచ్ఛందంగా రైతు బంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి రూ.1.60లక్షలు, మేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు రూ.1.60లక్షలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ రూ.1.28లక్షలు, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రూ.లక్ష, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ రూ.76వేలు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు రూ.20వేలు, మేడ్చల్ రైతు సమన్వయకర్త నందారెడ్డి రూ.1.70లక్షలు రైతు బంధు సాయాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయనున్నారు. వీరి బాటలోనే మరికొంత మంది ముందుకు వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy