తిరుపతిలో భరత్ విజయోత్సవ సభ

BHARATHప్రిస్స్‌ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన భరత్‌ అనే నేను బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ సీఎం పాత్రలో అదరగొట్టాడు. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ సినిమా.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

దేవీశ్రీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఇతర సినీ తారలు కూడా సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం (ఏప్రిల్-23) సక్సెస్‌ మీట్‌ నిర్వహించిన టీమ్.. విజయోత్సవ వేడుకను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్‌ స్కూల్ గ్రౌండ్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందని ప్రకటించింది సినిమా యూనిట్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy