తిరుమలకు చేరుకున్న సీఎం

cmkcr-renigunta

శ్రీవారి మొక్కు చెల్లించేందుకు తిరుమలకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యామిలీతో కలిసి బయల్దేరిన సీఎం… ఐదు గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.  ఎయిర్ పోర్ట్ దగ్గర సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు ఏపీ అధికారులు.

ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం కేసీఆర్… తిరుమల గెస్ట్ హౌజ్ కు చేరుకున్నారు. అతిథి గృహం అధికారులు సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి స్వాగతం పలికారు.

అంతకు ముందు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న మంత్రులు, అధికారులు రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు, సీఎస్ ఎస్పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మకు ఏపీ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

రాత్రికి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం లో బస చేయనున్న సీఎం.. బుధవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకుంటారు. 5 కోట్లతో తయారు చేయించిన స్వర్ణ సాల గ్రామాహారం, కంఠాభరణాన్ని స్వామివారికి సమర్పిస్తారు. సీఎం ఫ్యామిలీతో పాటు మంత్రులు, అధికారులు శ్రీవారి సేవలో పాల్గొంటారు.

సీఎం ఫ్యామిలీ, మంత్రుల టూర్ సందర్భంగా గెస్ట్ హౌజ్ పరిసర ప్రాంతాలలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ ముందే తిరుమల వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు, సీఎం ఫ్యామిలీ, మినిస్టర్స్ , అధికారుతో పాటు మొత్తం 43 మంది తిరుమల చేరుకున్నారు.

సీఎం కేసీఆర్ తిరుమల వచ్చిన సందర్భంగా అభిమానులు, తమిళనాడు తెలుగు యువశక్తి కార్యకర్తలు ర్యాలీలు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy