తిరుమలలో చిన్నారి కిడ్నాప్.. ఈ ఏడాదిలో రెండోది

girl-kidnapped-tirumalaతిరుమలలో కలకలం. మరో కిడ్నాప్ ఘటన అందరిలోను ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల  నందినిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం(జూలై 23న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని అమ్మపాళెంకు చెందిన సురేష్‌ తిరుమలలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య దాక్షాయిణి, ఇద్దరు కుమార్తెలు నందిని (7), మహాలక్ష్మి(4)తో కలసి తిరుమలలోనే నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న స్థానిక యాత్రిసదన్‌–4 వద్దకు  పెద్దకుమార్తె నందిని తాగునీటికోసం వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభించక పోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఓ మహిళతో నందిని ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనను టీటీడీ సీవీఎస్‌వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్‌పి అభిషేక్‌ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy