తిరుమలలో తప్పిపోయిన ఆదిలాబాద్ వాసి

TIRU-2తిరుమల అటవీ ప్రాంతంలో ఓ భక్తుడు తప్పిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా హీరాపురాకు చెందిన రాథోడ్ గోవిందరావు సోమవారం(ఆగస్టు-7) అర్ధగిరి వేద పాఠశాల సమీపంలో తప్పిపోయాడు.  తను అటవీలో చిక్కుకున్నట్లు సోమవారం కుటుంబ సభ్యులకు ఫొన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తిరుమల బయల్దేరారు. మళ్లి మంగళవారం(ఆగస్టు-8) ఇంకోసారి ఫొన్ చేసి తను ఎక్కడున్నానో తెలియడం లేదని చెప్పాడు. దీంతో  కుటుంబ సభ్యులు తిరుమల పోలీలసుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 10 బృందాలు… 3 రోజులుగా అటవీలో వెతుకుతున్నారు.  ఇప్పటి వరకు  జాడ తెలియకపోడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy