తిరుమలలో హై అలర్ట్ : నలుగురి దగ్గర తుపాకీ, బుల్లెట్లు

tirumala-drinkతిరుమల అలిపిరి చెక్‌పోస్టు దగ్గర టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 14 బుల్లెట్లు, పిస్టల్‌ ను గుర్తించారు. మహారాష్ట్ర పుణె రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనంలో ఓ మహిళ సహా ముగ్గురు తిరుమలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి చెక్‌పోస్టు దగ్గర టీటీడీ నిఘా, భద్రతా విభాగం సిబ్బంది జరిపిన వాహనాల తనిఖీల్లో ఆ కారులో 14 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా గాలిగోపురం, తిరుమలలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy