తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం

TMLKONDA -CHARYALUతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు .. అక్కగార్ల గుడి సమీపంలో బండ రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ సమయంలో వాహనాలు, కాలి నడకన వచ్చే భక్తులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బండరాళ్లు, చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది… వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy