తిరుమల లడ్డూకు ఎన్నేళ్లో తెలుసా…

tirupati_ladduతిరుమల తిరుపతి అనగా ముందుగా గుర్తొచ్చేది అక్కడి లడ్డు. ఎవరైనా తిరుపతికి వెళ్లివచ్చాం అంటే చాలు లడ్డూ ప్రసాదం ఏది అని అడుగుతారు. అంతటి పేరుంది ఆ లడ్డూకు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సరే లడ్డూ ప్రసాదం తీసుకుంటేనే భక్తులకు తృప్తి.  అంతేకాదు ఎక్కువ మొత్తం లో లడ్డూలు తీసుకుని..ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచి సంతృప్తి పొందుతారు. నోరూరించే తిరుమల లడ్డూకు  పెద్ద తీపి చరిత్ర ఉంది. 1803 లో మొదటి సారి లడ్డూకు బదులుగా బూందీని ప్రసాదంగా ప్రవేశపెట్టారు ఆలయ నిర్వాహకులు. ఇది 214 ఏళ్ల కిందటి విషయం.

శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాల తయారీ మొదలైంది. రెండో దేవరాయల కాలం నుంచి ప్రసాదాల తయారీ మరింత పెరిగింది. ఆ సమయంలోనే స్వామికి నైవేద్య వేళలు ప్రవేశపెట్టారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగలి అని పిలిచేవారు. తర్వాత సుఖీయం, అప్పం,వడ,అత్తిరసం,మనోహరపడి అంటూ రకరకాల ప్రసాదాలను ప్రవేశపెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు భక్తులు వడను మాత్రమే కోరేవారు. దీన్ని గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాల అమ్మకాన్ని ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు తొలిరూపమైన బూందీని తీపి ప్రసాదంగా ప్రవేశపెట్టారు.1940లో బూందీని లడ్డూగా తయారు చేసి అమ్మడానికి శ్రీకారం చుట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy