తీపి కబురు : NRHM లో 1,248 ఉద్యోగాలు

NRHM-Logo-GovtJobsRecruit-e1500129960786నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం NRHM పథకం అమలు కోసం వివిధ కేటగిరీల్లో 1,248 ఉద్యోగాల కల్పనకు అంగీకరించింది. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన స్టేట్‌ హెల్త్‌ సొసైటీ కార్యనిర్వాహణ కమిటీ సమావేశం శుక్రవారం(జూలై-22) హైదరాబాద్‌లో జరిగింది. NRHM నిధులలో రూ.1,533కోట్లు ఖర్చు చేసేందుకు స్టేట్‌ హెల్త్‌ సొసైటీ అనుమతులు తీసుకుంది. ఇందులో భాగంగా 50 పడకల మాతా శిశు వైద్యశాలలను మరో ఐదింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

NRHM కింద గతేడాది రూ.532.86 కోట్లు, ఈ ఏడాది రూ.1,000 కోట్లు కలిపి మొత్తంగా రూ.1,532.88 కోట్లను ఖర్చు చేసేందుకు సొసైటీ అనుమతులు తీసుకుంది. రూ.10 కోట్లతో లేబర్‌ రూమ్స్‌ ఆధునీకరణ, రూ.8.5 కోట్లతో 3 హైడిస్పెన్సరీ యూనిట్లు, 2 ICUను నెలకొల్పాలని సమావేశంలో నిర్ణయించారు. ‘అమ్మ ఒడి’ కింద ఇప్పటికే 40 వాహనాలు ఉండగా.. భవిష్యత్‌ అవసరాల కోసం మరో 200 కొనుగోలు చేయనున్నారు. వ్యాధుల నివారణకు జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 31 జిల్లా కేంద్రాల్లో సమగ్ర వ్యాధుల నిరోధక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు నిలోఫర్‌ ఆస్పత్రిలో 12 కంగారూ మదర్‌ కేర్‌ యూనిట్లు, 22 డయాలసిస్‌ యూనిట్లు, 12 DEICలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకులు, 10 వేల మంది పిల్లలకు న్యూ బార్న్‌ స్క్రీనింగ్‌లు చేయాలని, అలాగే 7 SNCUలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వ్యాధుల నిర్ధారణలో ICMR సహకారం: అసంక్రామిక వ్యాధుల (NCD) నిర్ధారణలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సహకారం రాష్ట్రానికి అందిస్తామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ రీసెర్చ్‌ (ICMR) వెల్లడించింది. శుక్రవారం(జూలై-21) మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమైన ICMR ప్రతినిధుల బృందం.. గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులను ముందే గుర్తించే వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ చాలా ముందుందని తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy