తుది అంకానికి కర్నూల్ ప్రచారం

Chandrababu-Jaganకర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికకు.. సోమవారంతో ప్రచారం పూర్తి కానుంది. దీంతో.. నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నాయకులు.. గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు, జగన్.. ఇద్దరూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. తమనే గెలిపించాలని ఓటర్లను కోరారు.

నియోజకవర్గంల విస్తృత ప్రచారాన్ని కొనసాగించిన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్.. డైలాగ్ వార్ కంటిన్యూ చేశారు. ముస్లిం, కాపు నేతలతో సమావేశమైన బాబు.. టీడీపీతోనే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. నంద్యాలలో ప్రచారం చేసిన YCP అధినేత జగన్…చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేశారు. వర్షం పడుతున్నా.. ప్రచారాన్ని కంటిన్యూ చేశారు. ఎన్నికల టైంలోనే బాబుకు జనం గుర్తొస్తారని అన్నారు.

టీడీపీ, వైసీపీ తీరుపై.. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆ రెండు పార్టీలు డబ్బులు ఖర్చు చేస్తున్నరంటూ.. నంద్యాల ఎన్నికల అధికారి ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఉప ఎన్నికను వాయిదా వేయాలన్నారు. YCP పై మరోసారి ECకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఈసీని, ప్రజలను YCP తప్పుదోవ పట్టిస్తోందన్నారు. డబ్బులు తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన YCP పై చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న తనను కొందరు బెదిరిస్తున్నారని.. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నటుడు వేణుమాధవ్ ఫిర్యాదు చేశారు. సోమవారం(ఆగస్ట్ 21)తో నంద్యాల బైపోల్ ప్రచారం ముగుస్తుండడంతో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు.. నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy