వైజాగ్ కోసం….టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్

t20-tollywood-trophy-cricket-match-movie-events-stills-pictures00352హుదూద్ తుఫాను బాధితుల కోసం ఈ నెల 30 న ‘మేము సైతం’ పేరుతో చారిటీ షోను జరపనుంది టాలీవుడ్. ఇందులో భాగంగా టాలీవుడ్ స్టార్స్ అందరూ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తో పాటు, హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో నాలుగు టీంలు ఉంటాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్, బాహుబలి,  అనుష్క టీంలు క్రికెట్ ఆడనున్నాయి. ప్రతి టీంలో ఆరుగురు ప్లేయర్లు ఉంటారు. అందులో నలుగురు హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. అనుష్క టీంలో అక్కినేని అఖిల్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ టికెట్లు  http://in.bookmyshow.com లో అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ. 3000 రూపాయలు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy