తూర్పు ఆసియా దేశాలకు సహకారం : మోడీ

modiతూర్పు ఆసియా దేశాలకు భారత్ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు ప్రదానమత్రి నరేంద్ర మోడీ. ఈ ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామన్నారు. 3 రోజుల పాటు ఫిలిప్పీన్స్ లో పర్యటించిన మోడీ… భారత్ తిరుగు ప్రయాణమయ్యారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏషియాన్ ను దృష్టిలో పెట్టుకునే తయారు చేయబడిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇండో-పసిఫిక్ ప్రాంతం మధ్యలో ఉండడం ఏషియాన్ ప్రాముఖ్యతను పెంచాయన్నారు. ఫిలిప్పీన్స్ లో పర్యటించిన ప్రధాని… మనీలాలో జరిగిన 15వ ఇండియా-ఏషియాన్ సదస్సులో మాట్లాడారు.

ప్రాంతీయ భద్రత, శాంతియుత అభివృద్ధి కోసం ఏషియాన్ దేశాలకు భారత్ స్థిరమైన సహకారం అందిస్తుందన్నారు. ఉగ్రవాదం, హింసాత్మక అతివాదంపై భారత్ పోరాడుతోందన్నారు. వాటిపై ఇప్పుడంతా కలసికట్టుగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు మోడీ. 2018 జనవరిలో ఢిల్లీలో జరిగే ఇండియా-ఏషియాన్ ప్రత్యేక సదస్సు కోసం ఎదురు చూస్తున్నట్టు మోడీ చెప్పారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావాలని ఏషియాన్ దేశాధినేతలకు భారతీయులంతా స్వాగతం పలుకుతున్నారన్నారు మోడీ.

అంతకుముందు రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు మోడీ. RCEP సదస్సులో నేతలంతా… జాయింట్ ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. దీనికి ముందు న్యూజిలాలండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్, బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా, జపాన్ ప్రధాని షింజో అబే, వియత్నాం ప్రధాని న్యూయెన్ షాన్, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ లతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు మోడీ.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy