బీజేపీ – సేన బంధం ఇక అంతేనా..?

modi_uddhavఇంకు వివాదం దశాబ్దాల బీజేపీ-శివసేన బంధానికి చిచ్చుపెట్టింది. పొసగని పొత్తులా సాగుతున్న బంధాన్ని తెంచుకునేందుకు సుధీంద్ర కులకర్ణిపై జరిగిన దాడిని సాకుగా మలుచుకుంటున్నాయి. ఫడ్నవీస్ సర్కారు నుంచి సేన మంత్రులు క్విట్ అయ్యే రేంజ్ కు చేరింది వివాదం. ఇంతకీ బీజేపీ-శివసేన మధ్య దూరం పెరగడానికి కారణమేంటి ?  తెగతెంపులు తప్పవా ?

సుధీంద్ర కులకర్ణి ఇష్యూ బీజేపీ, శివసేన మధ్య దూరం పెంచేలా ఉంది. ఈ ఘటనపై మహారాష్ట్ర మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ అయ్యారు. ఫస్ట్ టైం శివసేనపై డైరెక్ట్ అటాక్ చేశారు. సుధీంద్రపై అటాక్ తో రాష్ట్రం పరువుపోయిందని ఘాటుగా స్పందించారు.  ఫడ్నవిస్ కామెంట్స్ పై శివసేన సీరియస్ గా రియాక్టైంది. ఇదే పుస్తకావిష్కరణ మరో స్టేట్ లో జరిగి ఉంటే బీజేపీ అడ్డుకోకుండా ఉంటుందా అని ప్రశ్నించింది. మేం చేస్తే తప్పేంటి అని రివర్స్ అటాక్ చేసింది. ఇదొక్కటే కాదు గతవారం ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఆయన పర్యటనకు శివసేన మంత్రులెవరూ హాజరుకాలేదు. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేను పిలవలేదన్నది శివసైనికుల కోపం. అయితే మోడీ సభలకు హాజరవ్వడం ఇష్టం లేకనే… ప్రోటోకాల్ ఒప్పుకోదని తెలిసి.. మంత్రులు అలిగారని బీజేపీ అంటోంది.

మొత్తానికి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అది సుధీంద్ర కులకర్ణిపై దాడితో ఎక్కువైంది. నిజానికి వచ్చే నెల 1న కళ్యాణ్-దోంబివాలి,. కోల్హాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. జనరల్ ఎలక్షన్స్ లాగే వీటినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి అన్ని పార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావించిన సేన.. ఆ పార్టీకి దూరమైతే… ఎన్నికల్లో లాభాపడొచ్చనుకుంటోంది. అందులో భాగంగా రెండు కార్పొరేషన్లలోని 122 డివిజన్లకు ఒంటరిగా పోటీచేస్తున్నట్టు ప్రకటించింది. మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ కు 22 సీట్ల దూరంలో ఆగిపోయింది బీజేపీ. దానికి శివసేన మద్దతు కీలకం. లెటెస్ట్ కాంట్రవర్సీతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఈ దూరం ప్రభుత్వం నుంచి వైదొలిగే వరకేనా ? లేక ఫడ్నవీస్ సర్కారును కూలదోసే దాకా వెళ్తుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో కనబడుతున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy