తెగబడి రెచ్చిపోయారు : గంటలో నాలుగు ఇళ్లు దోపిడీ

House-Theftశివారు ప్రాంతాల్లో అంతరాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాళం వేసి ఉంటే చాలు.. దోపిడీ చేసేస్తున్నాయి. ప్లాన్డ్ గా ఇళ్లను చక్కబెట్టేస్తున్నారు దొంగలు. కీసర మండలం గోధుమకుంట పంచాయతీ పరిధిలోని ప్రజాయ్‌సాయిగార్డెన్ కాలనీల్లో దండగులు వరుసగా 4 ఇళ్లలో తాళలు పగులగొట్టి ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఆ కాలనీలో నివాసం ఉండే సివిల్ కాంట్రాక్టర్ శ్రీకాంత్ తన భార్య నాగవర్థని తీసుకురావడానికి గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటికి తాళాం వేసి ఎల్‌బీనగర్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో దాచిన 15 తులాల బంగారం, 47 తులాల వెండి ఆభరణాలు, పూజా సామగ్రితో పాటు రూ.30 వేల నగదును దోచుకెళ్లారు.

ఇదే వరుసలో గోవిందరాజు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. అయితే యజమాని వాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఏం పోయిందో తెలియడం లేదని తెలిపారు డాక్టర్లు. ఇదే కాలనీలో రామాలయానికి ఎదురుగా ఉండే శ్యాంసుందర్ ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు ఆయన ఇంట్లో 12 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, పూజా సామగ్రిని దోచుకెళ్లారు. ఇతని ఇంటి పక్కన ఉన్న నరేందర్‌రాజు ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు ఆ ఇంట్లో ఉన్న మద్యాన్ని కూడా తాగారు.

చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పని అంటున్నారు మల్కాజ్‌గిరి ఏసీపీ మహ్మద్ రఫీక్. గురువారం ప్రజాయ్‌సాయిగార్డెన్‌లో చోరీ జరిగిన ఇళ్లను ఆయన స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో అంతరాష్ట్ర ముఠా సంచరిస్తున్నారని ప్రజలు ఈ విషయమై ఎప్పటికప్పుడు ఆప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy