తెలంగాణపై కేసీఆర్ వరాల జల్లు..

KCR-IMAGE2తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నిన్న జరిగిన రెండో కేబినేట్ మీటింగ్ లో ఎన్నికల హామీల గురించి దాదాపు ఐదారు గంటల పాటు మంత్రులతో చర్చించారు. కేబినేట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ చెప్పి ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. కొత్త పథకాలు.. పాత వాటికి మెరుగులు.. ఇలా.. పాలనపై తనదైన ముద్రవేశారు కేసీఆర్. పథకాల రూపకల్పనలో తన బ్రాండ్ చూపించారు. ఎన్నికల హామీల అమలుకు కేబినెట్ తీర్మానం చేయడమే కాకుండా… కొత్త పాలసీలను కూడా ప్రకటించారు. అణగారిన వర్గాలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. హామీలపై గంపెడాశలుపెట్టుకున్న లబ్ధిదారులకు… సరికొత్త పథకాలను కానుకగా ఇచ్చారు.

దళితుల కోసం ‘కళ్యాణ లక్ష్మి’…

కల్యాణ లక్ష్మి… మొదటినుంచి దళిత గిరిజనులను అక్కున చేర్చుకునేందుకే ప్రత్యేక శ్రద్ధ చూపించారు కేసీఆర్. అందుకే… ఎస్సీ, ఎస్టీ మహిళల పెళ్లిళ్లను ప్రభుత్వం దగ్గరుండి జరిపించాలని నిర్ణయించింది. పెళ్లి ఖర్చుల మొత్తాన్ని ప్రభుత్వమే బరించనుంది. దళిత, గిరిజన యువతుల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ స్కీమ్ కింద అమ్మాయి కుటుంబానికి రూ.50 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయనుంది.

కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు జోరు….

కొత్త రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు జోరు మీద ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు.. తెలంగాణ వచ్చినా.. ఉద్యోగ ప్రకటనల్లేవన్న విమర్శలకు చెక్ చెప్పారు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కొత్త వాహనాల కొనుగోళ్లకు కేబినెట్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్. అందులో భాగంగానే… 3620 డ్రైవర్లు, కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్  చేస్తామన్నారు. కొత్త రాష్ట్రంలో వెలువడే తొలి ఉద్యోగ ప్రకటన ఇదే కావడం విశేషం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయడంతో పాటు కొత్త రాష్ట్రంలో మరి కొన్ని కొత్త ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.

మన వాళ్లకే ఫీజు రీయింబర్స్ మెంట్…

ఫీజు రీయింబర్స్ మెంట్ పై కేసీఆర్ తన మార్క్ చూపించారు. తెలంగాణ విద్యార్ధులకు మాత్రమే ఫీజు కడతామని స్పష్టం చేశారు. 1956 స్థానికత ఆధారంగానే లోకల్…నాన్ లోకల్ కేటగిరీలను వేరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇదీ సరికొత్త ఫీజురీయింబర్స్ మెంట్ పథకం. గత ప్రభుత్వం అమలుచేసిన బోధనా ఫీజుల పథకం అవినీతి మయంగా మారిందని భావిస్తున్న ప్రభుత్వం…దీని ప్రక్షాళనకు నడుంకట్టింది. బోగస్ లను ఏరివేసే ప్రయత్నాన్ని స్టార్ చేస్తుందని కేసీఆర్ చెప్పారు. అందుకోసమే “ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ” పథకాన్ని కొత్తగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

అవినీతిపై ఉక్కుపాదం…

ప్రభుత్వ పాలనను అవినీతి రహితంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై కేసీఆర్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే సంకల్పంతో ఉన్న కేసీఆర్..కబ్జాకోరులకు ఉగ్ర నరసింహావతారం చూపిస్తానన్నారు. త్వరలో చేపట్టబోయే గృహనిర్మాణ పథకంలో ఒక్క ఇంచ్ భూమి ..ఒక్క పైసా అన్యాక్రాంతం కానివ్వబోమని తెగేసి చెప్పారు. వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు జ్యుడిషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

వ్యవసాయ విద్యాలయానికి జయశంకర్ పేరు…

గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలకు కేరళ తరహాలో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. తెలంగాణకోసం పోరాడిన నాయకుల పేర్లతో కొత్త వర్శిటీలు, జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాన్ని విభజించి తెలంగాణకు ప్రొపెసర్ జయశంకర్ పేరిట వ్యవసాయ వర్సిటీని నెలకొల్పాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటుచేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy