తెలంగాణకు ప్రత్యేక శాటిలైట్ : కేటీఆర్

ktrత్వరలో సొంత శాటిలైట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. ఐటీశాఖ సారథ్యంలోని సాఫ్ట్‌నెట్‌ను టీ శాట్‌గా పేరుమార్చి విద్య, నిపుణ శాటిలైట్ చానళ్ల ద్వారా నూతన సేవలను అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీశాట్ నెట్‌వర్క్‌తో నడిచే విద్య, నిపుణ చానెళ్ల ద్వారా దూరవిద్య, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలీ మెడిసిన్, ఈ-గవర్నెన్స్ గురించి ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా ఈ రెండు చానళ్లను ప్రసారం చేస్తున్నామన్నారు ఐటీ మంత్రి.

ఇక్కడితో ఆగిపోదలుచుకోలేదు.. భవిష్యత్‌లో మాకంటూ ప్రత్యేక శాటిలైట్ తయారు చేసుకోవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అవసరానికి అనుగుణంగా 10 నుంచి 12 చానళ్ల ద్వారా ప్రభుత్వం మరింత చురుకుగా పనిచేయాలనుకుంటుందన్నారు. ఈ చానళ్ల ద్వారా విద్యార్థుల కోసం విద్యకు సంబంధించిన, యువత వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా మెరుగైన కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేస్తుందన్నారు.

టీ శాట్‌లోని ఎస్ అంటే స్కిల్స్, ఏ అంటే అకాడమిక్స్, టీ అంటే టెక్నాలజీ/ తెలంగాణ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అనే ఐదు ప్రధాన అంశాలను వివరించేందుకు ఈ విద్య, నిపుణ చానళ్లు పనిచేస్తాయని చెప్పారు. గతంలో ఆర్వోటీ ద్వారా ప్రసారాలకు పరిమితమైన మన టీవిని ఇప్పుడు ఇంటింటికీ చేరవేయడంలో సఫలీకృతం అయ్యామన్నారు. ఇస్రోతో ఒప్పందం చేసుకున్న అనంతరం వేగంగా ముందుకు సాగిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy