తెలంగాణపై బీజెపీ పార్లమెంటరీ సమావేశం

bjp_leadersతెలంగాణ బిల్లు అంశంలో తాజా పరిణామాల నేపథ్యంలో బీజెపీ పార్లమెంటరీ  మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో  పార్టీ పెద్దలు చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బీజెపీతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. పార్లమెంటులో టీ బిల్లు పాస్ అయ్యేందుకు, బీజెపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్.  ఇక తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు బీజెపీ రాజ్య సభ వ్యవహారాల నేత రవిశంకర ప్రసాద్. కాంగ్రెస్ సభ్యులే సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. షరతుల్లేని తెలంగాణకే తమ ఓటని రవిశంకర్ తెలిపారు. సీమాంధ్ర ప్రజల సమస్యలనూ తీర్చే విధంగా విభజన జరగాలని రవిశంకర ప్రసాద్ తెలిపారు.

 ఇక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తోందని బీజెపీ పార్లమెంటరీ వ్యవహారాల నేత ప్రకాశ జవదేకర్ అన్నారు. సభను అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్ చేయకుండా, సభను సజావుగా సాగనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని ధిక్కరిస్తున్న కిరణ్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బిల్లు ఎప్పుడు పెట్టినా బీజేపీ సహకరిస్తుంది ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy